![]() |
![]() |

ప్రస్తుతం ఎప్పుడేది ట్రెండింగ్ అవుతుందో ఎవరికి ఎరుక.. ఎప్పుడేది వైరల్ అవుతుందో ఎవరికి ఎరుక అన్నట్టుగా మారింది. కొంతమంది సెలెబ్రిటీలు కారు కొన్నా ఇల్లు కొన్నా వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అవుతారు. కానీ మరికొందరు ఓ చిన్న ఫోటోషూట్ తో ట్రెండింగ్ లోకి వచ్చేస్తారు.
అందులో భాగంగానే సావిత్రి అలియాస్ జ్యోతక్క తన ఇన్ స్టాగ్రామ్ లో పూలతో ఉన్న చీరలో అందంగా ముస్తాబై ఓ రీల్ చేసింది. దానికి ఇప్పుడు అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ అంటారు కదా.. అలా ఉన్నాయి. జ్యోతక్క భర్త గంగులు కూడా తనతో కలిసి రెగ్యులర్ గా వ్లాగ్స్ రీల్స్ చేస్తాడు. అవి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా తను చేసిన ఈ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతలా ఏం ఉందంటే తను చీర కట్టుకొని వెనక వైపు తిరిగి అలా సిగ్గుపడుతూ పాటకి తగ్గ హావభావాలు ఇచ్చింది. అయితే ఇందులో వైరల్ అవ్వాల్సిన విషయం ఏం ఉందంటే.. నెట్టింట కొంతమంది ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తారు. అమ్మాయి కాస్త అందాలు ఆరబోసినట్టు అనిపించినా వీళ్ళు వచ్చేసి తెగ నెగెటివ్ కామెంట్లు చేస్తారు.
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ వచ్చే పాటకి తను ఇచ్చే హావభావాలు.. ఆ నడక అన్నీ బాగున్నాయి. నిజం చెప్పాలంటే ఎక్కడ వల్గారిటీ కూడా లేదు. కానీ కొంతమంది అదేపనిగా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకముందు కూడా శివజ్యోతి అలియాస్ సావిత్రి రింగ్ రోడ్డు మీద ఓ రీల్ చేసింది. ఇక అది చూసి చాలామంది తనని వల్గర్ గా తిట్టారు. నెగెటివ్ కామెంట్లు కూడా పెట్టారు. అయితే తన ప్రతీ వీడియోకి చాలామంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. వారికి మాత్రం థాంక్స్ అంటూ రిప్లై ఇస్తుంది శివజ్యోతి. కానీ నెగెటివ్ కామెంట్లు చేసే వారికి ఓ చిన్న వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తను వారికి వార్నింగ్ ఇచ్చి మళ్లీ నెగెటివ్ అవ్వడం ఇష్టం లేకేమో అనిపిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో సావిత్రికి 1.1మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి మీలో ఎంతమంది తనని ఫాలో అవుతున్నారు.
![]() |
![]() |